జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు పోలీసులను కాల్చి చంపిన ఉగ్రవాదులు!

కలం, వెబ్​ డెస్క్​: జమ్ముకశ్మీర్​ లో కిష్త్వార్​ జిల్లాలో విధుల్లో ఉన్న ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (SPO) అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమై, చివరకు మృతి (Kishtwar SPO Killing ) చెందారు. మార్వా ప్రాంతంలోని దేహర్నా అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో అదృశ్యమైన అధికారుల కోసం గాలింపు చేపట్టిన బృందాలు దాచన్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాల లభించాయి.

చనిపోయిన వారిని రష్పాల్ సింగ్ (45), బాబీ చంద్​ కియార్​ (57)గా అధికారులు గుర్తించారు. వీరిద్దరూ దాచన్​ నుంచి అప్పర్​ రిడ్జ్ దేహార్నాలోని ఇందర్వాన్​ మీదుగా బస్నాన్​ కు వెళ్తుండగా ఈ ఘటన జరగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారు అదృశ్యమైన ప్రాంతానికి సుమారు 2 కిలోమీట్ల దూరంలో మృతదేహాలు లభ్యమయ్యాయి. శరీరంపై బుల్లెట్​ గాయాలు ఉండడంతో ఉగ్రావాదులే కాల్చిచంపారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాల్పులు జరిపిన వారి కోసం భద్రతా దళాలు కూంబింగ్​ చేపట్టాయి.

మరోవైపు, బుధవారం జమ్ముకశ్మీర్​ లో కుల్గామ్​ లోని సీఆర్పీఎఫ్​ క్యాంపుపై ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రదాడిలో భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ క్రమంలో కిష్త్వార్​ జిల్లాల్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల హత్య కలకలం సృష్టిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>