సోనియా గాంధీ జీవితంపై సినిమా తీస్తా: జగ్గారెడ్డి

క‌లం, మెద‌క్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం ఆధారంగా ఆమెపై తెలుగులో సినిమా తీస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) ప్రకటించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుగా వ్యవహరించాలని కోరారు. సోనియా గాంధీపై సినిమా నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు 50 మందితో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. సినిమా నిర్మాణం కోసం నిధులు సిద్ధం చేసుకోవాలన్నారు. ‘‘ఎన్నికలకు ఖర్చు పెడతారు కదా. దీన్ని అలాంటి ఖర్చుగానే అనుకోండి. బడ్జెట్ సమీకరించి, మంచి దర్శకుడిని ఎంపిక చేద్దాం’’ అని కార్యకర్తలతో జగ్గారెడ్డి అన్నారు.

సీఎం చేతుల మీదుగా..

నిధులు పోగయ్యాక సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను ఆహ్వానించి, వారి చేతుల మీదుగా షూటింగ్ ప్రారంభిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. సోనియా గాంధీ జీవితాన్ని కార్యకర్తలు మరింత దగ్గరగా తెలుసుకునేందుకు ఆమె పుస్తక ప్రతులను తెప్పించి పంపిణీ చేస్తామన్నారు. ఆమె కుటుంబ జీవితం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణానికి రూ.2 కోట్లు ఇస్తానని నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ జులకంటి ఆంజనేయులు ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>