సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ రెడ్డి సవాల్

క‌లం, మెద‌క్ బ్యూరో: ఈ నెల 19న సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్న నేప‌థ్యంలో దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఎమ్మెల్యే కొత్త‌ ప్ర‌భాక‌ర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) కోరారు. మల్లన్నసాగర్‌లో గోదావరి జలాలను నింపాలని డిమాండ్ చేశారు. ఉప కాలువల నిర్మాణం చేపట్టి, రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలన్నారు. ఇవన్నీ చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తనకే పేరొస్తుందని సీఎం రేవంత్ భావిస్తే.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డానికి సిద్దంగా ఉన్నాన‌ని స‌వాల్ విసిరారు.

రాయిపోల్ మండలం అనాజీపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన త‌ర్వాత ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయ‌కులు త‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌కుండా సీఎంను ఒప్పించి దుబ్బాకకు నిధులు తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ఏ ఒక్క మండ‌లాన్ని క‌రువు మండ‌లంగా ప్ర‌క‌టించకపోవడం దారుణమన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>