ఆంధ్రా అంటేనే స్పైసీ.. లోకేశ్ ఆసక్తికర పోస్ట్

కలం, వెబ్ డెస్క్: విశాఖలో గురువారం జరగబోయే సీఐఐ సదస్సు నేపథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఆసక్తికర పోస్ట్ చేశారు. “వైజాగ్‌కు స్వాగతం! స్పైసీ లేకుండా ఆంధ్రా ఫుడ్ మెనూ ఉండదు. స్పైసీ ఫుడ్ తినండి, వేగంగా అనుమతులు పొందండి. ఇదే ఇప్పుడు ఆంధ్రా విధానం. సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2026కు ఘన స్వాగతం” అని రాశారు. పారిశ్రామికవేత్తలను ఉత్సాహపరిచేందుకు ఆహారంతో ముడిపెడుతూ లోకేశ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సమకూర్చడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం విశాఖలో సీఐఐ సదస్సు అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తోంది. దీనికి దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు తరలిరానున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు.

సింగపూర్‌లో శిక్షణ..

అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయంలో సింగపూర్–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టాండింగ్ కమిటీ కార్యక్రమానికి మంత్రి లోకేశ్​ హాజరయ్యారు. ఇది మూడో సమావేశం కాగా, గత రెండు మీటింగుల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై సమీక్ష చేపట్టారు. మంత్రులు, టీచర్లకు సింగపూర్‌లో తీసుకున్న శిక్షణ సత్ఫలితాలినిస్తోందని మంత్రి లోకేశ్ ప్రశంసించారు. కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>