కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థలకు (Urban Local Bodies) సంబంధించి రేపు ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) విడుదల కానుంది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పుణేఠా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. గతంలో తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని 100 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో న్యాయపరమైన సమస్యలు, వివాదాల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి.
ప్రస్తుతం ఆయా అడ్డంకులు తొలగిపోవడంతో మిగిలిన స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందులో రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నాలుగు కార్పొరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలు షెడ్యూల్(Election Schedule)లో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎన్నికల తేదీలు, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై స్పష్టత రానుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రాజకీయ వర్గాల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది.
Also Read : ఎన్నికల అక్రమాల్లో చంద్రబాబు సరికొత్త ఆవిష్కరణలు: జగన్
Follow Us On : WhatsApp

