తెలంగాణలో 10+2 విద్యా విధానం.. సీఎం కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో వచ్చే ఏడాది నుంచే రాష్ట్రంలో 10+2 విద్యా విధానం అమల్లోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  అధికారులకు స్పష్టం చేశారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యా శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యా శాఖలో పలు సంస్కరణలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5వ తరగతి నుంచి 8 వరకు సెకండరీ విద్య, 9 నుంచి 12వ తరగతి వరకు స్పెషలైజ్డ్ విద్య అమలు చేయాలని ఆదేశించారు. 12వ తరగతి వరకు భాషా నైపుణ్యాలపై శ్రద్ధ పెట్టాలని, 12వ తరగతి దాటిన తరువాత పూర్తిగా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించడమే లక్ష్యంగా ఉండాలన్నారు.

అద్దె భవనాల్లో ఉండొద్దు..

జూనియర్ కాలేజీల్లో సిబ్బందికి ఉద్యోగ భద్రతకు ఢోకా లేదని.. లెక్చరర్ల రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్స్, సంక్షేమ హాస్టల్స్ అద్దె భవనాల్లో ఉండొద్దని సూచించారు. అన్నింటికీ శాశ్వత భవనాలు ఉండాలన్నారు. విద్యా సంస్థల నిర్మాణాలు నాణ్యతగా ఉండాలన్నారు. యూనివర్సిటీల్లో నియామకాలను మరింత వేగవంతం చేయాలన్నారు. దేశంలోనే ఉత్తమ విద్యా విధానాలు తెలంగాణలో ఉండేలా విద్యా శాఖ చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యా విధానం మార్చాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>