రాప్తాడు ఘటన.. హైకోర్టు కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్ : రాప్తాడు ఘటన (Raptadu Incident)కు సంబంధించి తొలగించిన నిందితుడి కాలును భద్రపరచాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హేమంత్ కాళ్లపై కాల్పులు జరిపిన పోలీసులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ న్యాయవాది గుండా గోపికృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నిందితుడి తొలగించిన కాలును భద్రపరచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులకు స్పష్టం చేసిన హైకోర్టు, తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.

Also Read : సైబర్ మోసం: వృద్ధుడు దాచుకున్న సొమ్ము మాయం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>