కలం, వెబ్ డెస్క్: భారత్ సమ్మిట్ (Bharat Summit) రాజకీయాల కోసం కాదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గురువారం నుంచి హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్న భారత్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండోసారి హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సమావేశాన్ని రాష్ట్రం కోసం ఎకనామిక్ ప్లాట్ ఫామ్ గా ఉపయోగించుకుంటామని చెప్పారు.
రాష్ట్రానికి ఉపయోగపడే సమ్మిట్ పై బీజేపీ విమర్శలు చేయడం సరికాదని.. అనవసర విమర్శలు మానుకోవాలని శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులపై భారత్ సమ్మిట్ లో చర్చించనున్నట్లు వెల్లడించారు. టెక్నాలజీ, పర్యావరణం, వాతావరణ మార్పులపై చర్చ జరుగుతుందన్నారు. అలాగే, జెన్ జీ డిమాండ్లపై కూడా చర్చించేందుకు ఒక సెషన్ కేటాయిస్తామని తెలిపారు. గాంధీ అహింస, నెహ్రూ ఫారిన్ పాలసీని తాము విశ్వసిస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
కాగా, భారత్ సమ్మిట్ (Bharat Summit) కు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు కీలక నేతలను తెలంగాణ కాంగ్రెస్ ఆహ్వానించగా వారు పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు జరిగే సమావేశానికి మూడు రోజుల పాటు కాంగ్రెస్ ప్రతిష్టత్మకంగా నిర్వహించనున్న సదస్సుకు 70 దేశాల నుంచి 1000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారు. ప్రజాస్వామ్యం, సామాజిక-ఆర్థిక న్యాయం, వాతావరణ మార్పులు, విదేశాంగ విధానం వంటి కీలక అంశాలపై సమ్మిట్ లో చర్చిస్తారు.
Also Read : నేడు కేంద్ర క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు చాన్స్!
Follow Us On : WhatsApp

