తిరుమలలో 21 ఏఐ స్మార్ట్ బస్టాప్‌లు.. రేమండ్స్ సంస్థ ముందడుగు

కలం, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు టీటీడీ కీలక చర్యలు చేపడుతోంది. ఉచిత ధర్మరథం బస్సులు ఆగే 21 పాయింట్లలో స్మార్ట్ బస్టాప్‌ల (Smart Bus Stops) ను నిర్మించేందుకు రేమండ్స్ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో ఇప్పటికే ఉన్న ఐదు బస్టాప్ షెల్టర్లను ఆధునికీకరించడంతో పాటు, మరో 16 చోట్ల కొత్త బస్టాప్‌లను నిర్మించనున్నారు.

ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో రాంభగీచా, లేపాక్షి కూడలితో పాటు మరో ప్రాంతంలో ఆధునిక సదుపాయాలతో పెద్ద బస్టాప్‌లను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన బస్టాప్‌లను తదుపరి రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు ఇప్పటికే ఏఐ ఆధారిత బస్టాప్ నమూనాను దాత సంస్థకు పంపించినట్లు తెలిపారు.

కొత్త బస్టాప్‌లలో భక్తులకు ఎండ, వర్షం నుంచి రక్షణ కల్పించేలా సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా, వెంకటాద్రి యాప్ ద్వారా స్మార్ట్ క్యూఆర్ కోడ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు కోడ్‌ను స్కాన్ చేస్తే బస్సు రూట్ మ్యాప్, బస్సు రాక సమయం, గమ్యస్థానానికి చేరుకునే అంచనా సమయం వంటి వివరాలను మొబైల్‌లోనే తెలుసుకోవచ్చు. దీంతో తిరుమలలో భక్తుల ప్రయాణం మరింత సులభంగా, సౌకర్యవంతంగా మారనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>