గ్రామాభివృద్ధికి చేయూత.. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రోత్సాహం!

కలం, బోనకల్: సేవా కార్యక్రమాలతో గ్రామాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, లక్ష్యసాధన పట్ల పట్టుదల పెంపొందించేందుకు ఎన్నారై యువకుడు భాగం రాకేష్ (Bhagam Rakesh) ముందడుగు వేశారు. మండల పరిధిలోని గోవిందాపురం(ఏ) గ్రామానికి చెందిన ఆయన.. భాగం సేవా ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండల గ్రామ పంచాయతీకి రూ.15 వేల విలువైన వీధిలైట్లను అందజేశారు.

అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులతో మమేకమయ్యారు. ప్రేరణ కలిగే అంశాలను చెబుతూ విద్యార్థులను చైతన్య పరిచారు. క్రమశిక్షణతో చదివి పదో తరగతిలో 500 మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తానన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పర్చ రామచంద్రరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాగం రాకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామానికి అవసరమైన వీధిలైట్లు అందించడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రోత్సాహక బహుమతులు ప్రకటించడం అభినందనీయమన్నారు. యువకుడైనప్పటికీ సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తంగిరాల మాధవి, భాగం పాపారావు, గుండ్ల రాంబాబు, ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>