అమెరికాలో నల్లగొండ యువతి అదృశ్యం.. రంగంలోకి కేటీఆర్

కలం, నల్లగొండ: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నల్లగొండ జిల్లాకు చెందిన యువతి అదృశ్యమైన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపూర్ (Shabdullapur) గ్రామానికి చెందిన శ్రీజ బోస్టన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తోంది. అయితే ఈ నెల 2వ తేదీ నుంచి శ్రీజ హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఎనిమిది రోజులు గడుస్తున్నా కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

శ్రీజ అదృశ్యమైన విషయం తెలుసుకున్న నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, శాబ్దుల్లాపూర్‌లోని శ్రీజ నివాసానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి, ఆచూకీ కనుగొనేందుకు తమ వంతుగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కంచర్ల భూపాల్ రెడ్డి శ్రీజ కుటుంబ సభ్యుల ఆవేదనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్ ఫోన్ ద్వారా శ్రీజ తల్లిదండ్రులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, శ్రీజ సురక్షితంగా తిరిగొచ్చేలా అమెరికాలోని తనకు తెలిసిన బృందాలు, తెలుగు సంఘాల ప్రతినిధులతో మాట్లాడి ఆచూకీ కోసం సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.అలాగే మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కూడా శ్రీజ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. శ్రీజ ఆచూకీని త్వరలోనే కనుగొనాలని, ఈ కష్ట సమయంలో కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని నేతలు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>