షాపింగ్‌ మాల్స్‌పై చర్యలు తీసుకోవాలి.. కలెక్టరేట్​ లో బీజేపీ కౌన్సిలర్ల ఫిర్యాదు

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో పార్కింగ్‌ సదుపాయం లేకుండా కొనసాగుతున్న షాపింగ్‌ మాల్స్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు (Nirmal BJP Councillors) డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. ఇటీవల పట్టణంలో చెన్నై, చందన బ్రదర్స్‌, మాంగళ్య తదితర భారీ షాపింగ్‌ మాల్స్‌ ప్రారంభమయ్యాయని తెలిపారు. అయితే ఆయా మాల్స్‌లో సరైన పార్కింగ్‌ సదుపాయం లేకపోవడంతో వినియోగదారులు తమ వాహనాలను రహదారులపైనే నిలుపుతున్నారని ఆరోపించారు. దీంతో ప్రధాన రహదారులపై నిత్యం ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

పార్కింగ్‌ సదుపాయం కల్పించకుండానే భారీ షాపింగ్‌ మాల్స్‌కు అనుమతులు ఎలా మంజూరు చేశారని అధికారులను ప్రశ్నించారు. సంబంధిత మాల్స్‌ యాజమాన్యాలపై విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా తక్షణమే పార్కింగ్‌ ఏర్పాట్లు చేయించాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారానికి అధికారులు స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు (Nirmal BJP Councillors) గంజి రాజు, రావులవారి విట్టల్‌, జింక సూరి, కూన శశాంక్‌, శ్రీరామోజు నరేష్‌, సూరజ్‌ నాయక్‌, నాయకులు ధర్మాజీగారి ఈశ్వర్‌, అయిండ్ల సాత్విక్‌, ఒడిసెల అర్జున్‌ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>