ఫ్యాన్స్​కు నిరాశ.. భారత్​–న్యూజిలాండ్​ మూడో వన్డే రద్దు

కలం, వెబ్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య హామిల్టన్ వేదికగా మంగళవారం జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ (IND vs NZ) ఆలస్యంగా ప్రారంభమైంది.

తొలుత 40 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌ను తిరిగి 20 ఓవర్లకైనా నిర్వహించాలని ప్రయత్నించినప్పటికీ వరుణుడు కరుణించలేదు. దీంతో నిర్ణీత కటాఫ్ సమయానికి ముందే మ్యాచ్‌ (IND vs NZ)ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉంది. మిగిలిన రెండు వన్డేలు నవంబర్ 13, 15 తేదీల్లో టౌరంగలో జరగనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>