శ్రీశైలంలో ఘనంగా కార్తీక మాసోత్సవాలు.. ఆ సేవలు రద్దు!

కలం, వెబ్ డెస్క్ : శ్రీశైల మహాక్షేత్రంలో (Srisailam Temple ) కార్తీక మాసోత్సవాలు నేడు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబర్ 9 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. ఈ పవిత్ర మాసంలో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన బోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. విశేషంగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. తద్వారా సామాన్య భక్తులకు శీఘ్రంగా , సులువుగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం లభించనుంది.

ఇక ఉత్సవాల సమయంలో రూ.5,000 విలువైన గర్భాలయ అభిషేకం, రూ.1,500 సామూహిక అభిషేకం టికెట్లతో పాటు ఉదయాస్తమాన, ప్రాతఃకాల, ప్రదోషకాల సేవల టికెట్లను రద్దు చేశారు. అయితే, రూ.1,000 విలువైన కుంకుమార్చనను ఆశీర్వచన మండపానికి మార్చగా, నిత్య కల్యాణోత్సవాలు, హోమాలు యథావిధిగా కొనసాగుతాయి. భక్తులు దర్శన సమయానికి గంట ముందు వరకు కూడా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ల కోటా కోసం ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ (95523 00009) ద్వారా 80%, ఆలయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా 20% కేటాయించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ నెల 24న శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>