కలం, మధిర: హైదరాబాద్ నుంచి మధిర వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు మార్గమధ్యలో వైరా (Wyra) పట్టణంలోని బస్టాండ్ వద్ద మొరాయించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్సు ఎందుకు నిలిచిపోయిందో.. అధికారులు, సిబ్బంది స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపించారు. గంటల తరబడి బస్టాండ్లో పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేరొక ప్రత్యామ్నాయ బస్సును కేటాయించి తమను మధిరకు చేర్చాలని ప్రయాణికులు కోరారు.

