బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మిత్రులు

కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక (Gaddapaka) గ్రామపంచాయతీ పరిధిలోని 7వ వార్డు మెంబర్ మునిగంటి వేణు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ దుఃఖ సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయన చిన్ననాటి మిత్రులు ముందుకు వచ్చారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు వేణుతో కలిసి చదువుకున్న సహచర మిత్రులందరూ కలిసి రూ. 51,000/- ఆర్థిక సహాయాన్ని సేకరించి వేణు కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సంక్షష్ట సమయంలో తమ కుటుంబాన్ని ఆప్యాయంగా పరామర్శించి, ఆర్థికంగా అండగా నిలిచిన చిన్ననాటి మిత్రులందరికీ మునిగంటి వేణు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో స్నేహధర్మాన్ని చాటుకున్న మిత్రుల బృందాన్ని గ్రామస్థులు అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>