కలం, స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళల జట్లు సిద్ధమయ్యాయి. ఈ టూర్ కోసం టెస్టు, వన్డే, టీ20 జట్లను బీసీసీఐ (BCCI) ప్రకటించింది. మూడు ఫార్మాట్లలోనూ స్మృతి మంధాన (Smriti Mandhana)నే కెప్టెన్‌గా వ్యవహరించనుంది. అయితే టెస్టు జట్టుకు ఆమె తొలిసారి నాయకత్వం వహించనుంది. జింటిమణి కలితకు కూడా టెస్టు జట్టులో తొలిసారి చోటు దక్కింది. టెస్టు, వన్డేలకు దీప్తి శర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనుంది.
టీ20లకు షఫాలీ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. మూడు ఫార్మాట్లలో కలిపి భారత జట్లు దక్షిణాఫ్రికాలో ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. డిసెంబర్ 9న గ్కెబెర్హాలో ఏకైక టెస్టుతో పర్యటన ప్రారంభమవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 16న పార్ల్‌లో తొలి వన్డే జరుగుతుంది. డిసెంబర్ 19న కేప్‌టౌన్‌లో రెండో వన్డే, 22న బ్లోమ్ఫోంటైన్లో మూడో వన్డే నిర్వహిస్తారు. ఇక టీ20 సిరీస్ డిసెంబర్ 26న బెనోనిలో ప్రారంభమవుతుంది. డిసెంబర్ 29, 30 తేదీల్లో పోచెఫ్స్ట్రూమ్లో చివరి రెండు టీ20లు జరుగుతాయి. డిసెంబర్ 30తో భారత పర్యటన ముగుస్తుంది.
Also Read : టీమిండియా కోచింగ్ టీమ్‌లో చీలిక!
Follow Us On : WhatsApp

