భువన్ సర్వేను వేగవంతం చేయాలి: కమీషనర్ ప్రఫుల్ దేశాయ్

కలం, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఆదాయ మార్గాలను మెరుగుపరచడంలో భాగంగా చేపట్టిన ‘భువన్’ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ (Karimnagar Commissioner Praful Desai) అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని 12 వ డివిజన్‌లో ప్రారంభమైన భువన్ సర్వేను క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేశారు. అనంతరం భువన్ సర్వే మొబైల్ యాప్ పనితీరును, సర్వే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.

​ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. గతంలో జియో ట్యాగింగ్ కాకుండా పెండింగ్‌లో ఉన్న కొత్త, పాత భవనాల భువన్ సర్వే ప్రారంభించినట్లు వెల్లడించారు. సర్వే మొబైల్ ఆప్ లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కగా వివరాలను నమోదు చేయాలని రెవెన్యూ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిదిలోని పెండింగ్ లో ఉన్న ప్రతి అసెస్మెంట్ కు సంబంధించిన సరైన సమాచారాన్ని డిజిటలైజ్ చేయాలన్నారు. భువన్ సర్వే ప్రక్రియను వేగవంతంగా నిర్ణిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ ఖాధర్ మొహియుద్దీన్, ఆర్వో నియాజ్, ఆర్ఐ శ్యామ్, వార్డు ఆఫీసర్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>