కారేపల్లిలో మూతపడిన ఉర్దూ పాఠశాల

కలం, కారేపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి (Karepalli) గ్రామపంచాయతీలో మూడేళ్లుగా ప్రభుత్వ ఉర్దూ పాఠశాల మూతపడటంపై బీఆర్ఎస్ నేత బానోత్ సుందర్‌లాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం, పాలనా వైఫల్యం కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ‘ప్రపంచ ఉర్దూ దినోత్సవం’ రోజు ఉర్దూ పాఠశాల ముసివేసి ఉండటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ​

ముస్లిం మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారని, కారేపల్లిలో ఉర్దూ పాఠశాల మూతపడుతున్నప్పుడు ఎందుకు స్పందించడం లేదని సుందర్‌లాల్ నిలదీశారు. మైనారిటీల విద్యా హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించిన సుందర్‌లాల్.. ఇప్పటికైనాపాఠశాలను వెంటనే పునఃప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>