స్వాతి నక్షత్రం.. యాదాద్రిలో బీర్ల అయిలయ్య గిరి ప్రదక్షిణ

కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని(Swathi Nakshatram) పురస్కరించుకొని సోమవారం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (MLA Beerla Ilaiah) భక్తులతో కలిసి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. పాదయాత్రగా సాగిన ఈ ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి దివ్య కృపకు పాత్రులయ్యారు.

సహస్రనామార్చన, గిరి ప్రదక్షిణ అనంతరం ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రాలను కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>