సీఎం చంద్రబాబు సంచలన డిమాండ్.. “ఆ నోట్లు రద్దు చేయాల్సిందే!”

కలం, వెబ్ డెస్క్ : దేశంలో అవినీతిని పూర్తిగా అరికట్టాలంటే రూ.500తో పాటు అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) డిమాండ్ చేశారు. మార్కెట్‌లో కేవలం రూ.100, రూ.200 విలువ గల చిన్న నోట్లను మాత్రమే చలామణిలో ఉంచి, డిజిటల్ చెల్లింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే పారదర్శకత పెరుగుతుందని.. తద్వారా నగదు ప్రాతిపదికన జరిగే అవినీతికి అడ్డుకట్ట పడుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా డిజిటల్ కరెన్సీ విప్లవానికి శ్రీకారం చుట్టింది తానేనని, ఈ మేరకు గతంలోనే ప్రధాని మోదీకి నివేదిక సమర్పించానని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.  రూ. 500 తో పాటు అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేసేంత వరకు ఈ అంశాన్ని ప్రధాని మోదీ వద్ద డిమాండ్ చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు  ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచే సంస్కృతి సరైంది కాదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తే సంపద సృష్టి కష్టం కాదని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో సంక్షేమ, ప్రాజెక్టుల అమలు తీరును సీఎం ప్రస్తావించారు.

భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతల విధానాన్ని, రైతులకు ఆర్థికంగా చేయూతనందించే ఇన్‌పుట్ సబ్సిడీని గతంలోనే ప్రవేశపెట్టానని తెలిపారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై రాళ్ల సీమగా మారిన రాయలసీమను అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రకృతి విపత్తుల సమయంలో తాను ఎప్పుడూ ఇంట్లో కూర్చోలేదని, తుఫాన్ తీరం దాటే సమయాన్ని కూడా కచ్చితంగా అంచనా వేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలిచానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>