పాల్వంచలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకులు ఢీకొని ఇద్దరు మృతి!

కలం, ఖమ్మం బ్యూరో: ​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ​భూక్యా సోమ్లా తన వదిన విజయతో కలిసి పునుకుల గ్రామం పరిధిలోని దేవిజ్యా తండాలో ఉన్న విజయ కుమార్తె ఇంటికి పండుగ నిమిత్తం బయలుదేరారు. ఈ క్రమంలో కిన్నెరసాని వైపు నుంచి వస్తున్న మరో బైక్ వీరి వాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ​ఈ ప్రమాద తీవ్రతకు భూక్యా సోమ్లా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఆయనతో పాటు ప్రయాణిస్తున్న విజయకు తీవ్ర గాయాలై చేయి విరిగింది. అలాగే, మరో బైక్ పై ఉన్న రంజిత్ కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ​సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విజయను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పండుగ వేళ జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>