శ్రీశైలంలో ట్రావెల్స్ బస్సు బీభత్సం.. ఐదు కార్లు ధ్వంసం!

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ట్రావెల్స్ బస్సు బీభత్సం (Srisailam Bus Accident) సృష్టించింది. పార్కింగ్ ప్రాంతంలో నిలిపి ఉన్న ఐదు కార్లను బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతో జరిగిన ప్రమాదంతో కార్లు తీవ్రంగా దెబ్బతినడంతో ధ్వంసమయ్యాయి. ఘటనలో ఓ బాలికకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పింది. ఈ క్రమంలో శ్రీశైలంలోని అలంకేశ్వరస్వామి ఆలయం క్లోజింగ్ గేట్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>