దశలవారీగా ప్రజా సమస్యల పరిష్కారం: అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కలం, కరీంనగర్ : ధర్మపురి నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఇంట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏ నాడు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో పాటు సాగునీటి సమస్యను పట్టించుకోలేదని అన్నారు.

ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోతే పంటలు పరిశీలనకు వచ్చిన మాజీ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని మంత్రి (Laxman Kumar) మండిపడ్డారు. రూ. 40 కోట్లతో ప్రారంభించిన రోళ్ళ వాగు ప్రాజెక్టు అంచనాలు రూ. 140 కోట్లకి పెంచి ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు. ధర్మపురి నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవడానికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ నిర్మాణం చేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి ఇప్పటికే ఐటిఐ తో పాటు డిగ్రీ కళాశాల బస్సు డిపో మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోరవతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిధులు తీసుకొస్తున్నట్టు మంత్రి తెలిపారు.

దోనూరు గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు రోడ్లు డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి సందర్భంగా గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామంలో గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలుమల లక్ష్మణ్, గ్రామ సర్పంచ్ పురుషోత్తంతో పాటు వేముల రాజు, నరసింహులుతో పాటు పలువురు సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>