దిమాగీ నక్సల్స్‌తో దేశానికి ప్రమాదం : ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్: సాయుధ మావోయిస్టులు అంతమైనంత మాత్రాన దేశానికి ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు కాదని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఒకప్పుడు మావోయిస్టు తిరుగుబాటుకు కేంద్రబిందువుగా ఉన్న బస్తర్ ప్రాంతంలో ఆదివారం ప్రధాని భద్రతా దళాల సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైనికులు, భద్రతా సిబ్బందికి స్వీట్స్ తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. దిమాగీ నక్సల్స్ పేరుతో పిలవబడుతున్న వారు వివిధ రాజకీయ పార్టీలు, సంస్థల్లోకి చొరబడి రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. అలాంటి శక్తులను గుర్తించి, ఓడించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా కొనసాగిన మావోయిస్టు సంఘర్షణ అనంతరం ఈ దీపావళి చారిత్రాత్మకమైనదని ప్రధాని మోదీ అభివర్ణించారు.

దేశంలోని ప్రతి జిల్లాలో మావోయిస్టు తిరుగుబాటు నుంచి విముక్తి లభించిందని కేంద్రం ప్రకటించిన తర్వాత జరుపుకుంటున్న తొలి దీపావళి ఇదేనని ప్రధాని (PM Modi) వెల్లడించారు. 2026 మార్చి 31న సాయుధ మావోయిస్టు తిరుగుబాటు ముగిసిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బస్తర్‌లో భద్రతా దళాలతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు జరుపుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>