దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి: కలెక్టర్

కలం, నిర్మల్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Bhavesh Mishra) జిల్లా ప్రజలందరికీ ఆదివారం దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి దీపావళి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఆశలు, ఆనందాలు, సానుకూల ఆలోచనలు నింపాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగ సమాజంలో ఐక్యత, సోదరభావం, ప్రేమానురాగాలను పెంపొందించాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరారు.

పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా భద్రతా నియమాలను అనుసరించాలని ప్రజలకు సూచించారు. ఈ దీపావళి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అభివృద్ధి, శ్రేయస్సును అందించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>