కలం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెలమ కార్పొరేషన్ తొలి చైర్మన్గా జువ్వాడి నర్సింగరావు శనివారం హైదరాబాద్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. మైత్రి వనం హెచ్ ఎండీఏలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyanarayana) హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ జువ్వాడి నర్సింగరావుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం హకీంపేటలోని జూపల్లి బాలమ్మ వెలమ కన్వెన్షన్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా కవ్వంపల్లి (MLA Kavvampally Satyanarayana) పాల్గొన్నారు. జువ్వాడి నర్సింగరావు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పార్టీ బలోపేతానికి చేసిన కృషి, అంకితభావానికి గుర్తింపుగా వెలమ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించిందని ఎమ్మెల్యే కవ్వంపల్లి పేర్కొన్నారు. నూతన బాధ్యతల్లో నర్సింగరావు విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

