కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్య దీపాల వెలుగులతో జిగేల్ మంటోంది. రాముడి జన్మించిన ఆ పుణ్యభూమిలో 10వ దీపోత్సవ్ (Ayodhya Deepotsav–2026) వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈసారి ఆలోకిత్ అయోధ్య-అలౌకిక్ అయోధ్య అనే థీమ్ తో జరగుతున్న వేడుకలకు సరయూ నది తీరంలోని 56 ఘాట్లను లక్షలాది మట్టి దీపాలతో అలంకరించారు. ఇందుకోసం 30 లక్షలకు పైగా మట్టి దీపాలను సిద్ధం చేశారు.
భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతతో పాటు భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ దీపోత్సవం అయోధ్య ఆధ్యాత్మిక వైభవాన్ని మరోసారి చాటి చెబుతోంది. సరయూ నది తీరంలో దీపాల కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండటంతో నగరం పండుగ శోభను సంతరించుకుంది. ఈ వేడుకలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపుతున్నాయి.

