అమృతకు బండి సంజయ్ ఆపన్న హస్తం

కలం, కరీంనగర్ బ్యూరో: సొంత ఇల్లు లేక స్మశానమే నివాసంగా మార్చుకుని అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడితో కలిసి దుర్భర జీవితాన్ని గడుపుతున్న మహిళకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) బాసటగా నిలిచారు. చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మర్రిపల్లి అమృతకు తక్షణ సాయంగా రూ.50 వేలు పంపించారు. ఈ నగదు మొత్తాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ద్వారా బాధితురాలికి అందజేశారు. దీంతోపాటు జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తో కేంద్ర మంత్రి ఫోన్లో మాట్లాడుతూ అమృత దుస్థితిని వివరించారు.

అమృతకు తక్షణమే డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని బండి (Bandi Sanjay) కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. మరోవైపు అనారోగ్యం బారిన పడిన కొడుకుతో కలిసి శ్మశానంలో నివసిస్తూ పుట్టెడు దుఃఖంలో ఉన్న అమృతకు అన్ని విధాలా అండగా ఉండాలని బండి సంజయ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరైన వెంటనే ఆ ఇంటికి అవసరమైన సామాగ్రితోపాటు కుటుంబానికి సరిపడా నిత్యావసర సరుకులను అందించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>