వెలమ కార్పొరేషన్ చైర్మన్‌కు శ్రీహరిరావు శుభాకాంక్షలు

కలం, నిర్మల్: తెలంగాణ తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జువ్వాడి నర్సింగరావును (Juvvadi Narsing Rao) కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీహరిరావు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెలమ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వెలమ సామాజిక వర్గానికి న్యాయం చేసే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అన్ని సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తరహాలో వెలమ కులానికి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. నూతన చైర్మన్ జువ్వాడి నర్సింగరావు నాయకత్వంలో వెలమ సామాజిక వర్గంలోని మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహకారం అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>