ఎన్నికల ఫలితాల్లో విజయం.. అయినా అక్కడ విషాదం!

కలం, వెబ్ డెస్క్ : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం ఎంపీటీసీ స్థానం ఎన్నికల ఫలితాల్లో విషాదకర ఘట్టం చోటుచేసుకుంది. ఈ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గారపాటి దివ్య (Garapati Divya) ఓట్ల లెక్కింపులో 352 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే, తన గెలుపు వార్తను వినకుండానే ఆమె అనంత లోకాలకు తరలిపోవడం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.

పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం అస్వస్థతకు గురైన దివ్యను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ గుండె సంబంధిత సమస్యతో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె కన్నుమూశారు. శనివారం అధికారులు చేపట్టిన ఓట్ల లెక్కింపులో దివ్య గెలిచినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. విజయం తలుపు తట్టిన వేళ అభ్యర్థి లేకపోవడంతో ధుమంతునిగూడెంలో ఆనందానికి బదులు విషాదం అలుముకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>