పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలి.. ఎస్పీ కీలక ఆదేశాలు!

కలం, నిర్మల్: పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) అధికారులను ఆదేశించారు. శనివారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు అధికారి కార్యాలయం నుండి అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, సైబర్ వారియర్స్‌తో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల పురోగతిని ఎస్పీ సమీక్షించారు.

సైబర్ నేరాల కేసులను వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని, ఈ-పెట్టి కేసులతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఏ కేసునూ అనవసరంగా పెండింగ్‌లో ఉంచవద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు, డీసీఆర్‌బీ, ఐటీ కోర్, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>