రైతుల గళం వినిపించేందుకే రైతు గర్జన : అనిల్ జాదవ్

కలం, నిర్మల్: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 11న నిర్మల్ జిల్లా కేంద్రంలో రైతు గర్జన సభ (Rythu Garjana Sabha) నిర్వహిస్తున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సభ ఏర్పాట్లకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్, యువ నాయకుడు నల్ల వినయ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వ్యవసాయ రంగంలో నెలకొన్న పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రైతు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభకు రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని, నవంబర్ 11న నిర్మల్ పట్టణం గులాబీమయం కానుందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సభకు వచ్చే రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జిలు రాంకిషన్ రెడ్డి, జాన్సన్ నాయక్, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, నాయకులు అయ్యనగారి రాజేందర్, రిజ్వాన్ ఖాన్, మీనాజ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>