కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా చంద్రగిరి (Chandragiri) మండలం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమచారం. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే నిరంతరం ప్రయాణికులతో రద్దీగా ఉండే చంద్రగిరి జాతీయ రహదారి(Chandragiri NH)పై వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మితిమీరిన వేగం, డ్రైవర్ల నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తున్న నేపథ్యంలో, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నిబంధనలు పాటించేలా రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనాదారులు కోరుతున్నారు. అదే విధంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద పోలీస్ నిఘా, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి, ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తుచేస్తున్నారు.
Also Read : మత్తు పదార్థాలపై ఉక్కుపాదం: 1.37 లక్షల కిలోల గంజాయి దహనం!
Follow Us On: X(Twitter)

