రేపే ఎన్నిక‌ల ఫ‌లితాలు.. జ‌న‌సేనలో తీవ్ర విషాదం!

కలం, వెబ్‌డెస్క్‌: ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుమంతునిగూడెం గ్రామానికి చెందిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి (Janasena MPTC Candidate) గారపాటి దివ్య (25) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. గ్యాస్ నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్ర‌వారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది.

ఏపీలో ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాలు శ‌నివారం వెల్ల‌డి కానున్నాయి. ఈ నేపథ్యంలో దివ్య మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్నికల ఫలితాలను చూడకుండానే ఆమె కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో దుమంతునిగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>