కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండలంలోని విద్యాసంస్థల పరిసర ప్రాంతాలు, పాడుబడిన వెంచర్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం వలిగొండ పట్టణ శివారులోని వెంచర్ వద్ద మద్యపానం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

