కలం, స్పోర్ట్స్: ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ సమరంపై భారత టాప్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) స్పందించారు. డి గుకేష్, జవోఖిర్ సిందరోవ్ మధ్య జరిగే పోరు అత్యంత ఆసక్తికరంగా ఉంటుందన్నాడు. వీరిద్దరూ తనకు చిన్నతనం నుంచే తెలుసని చెప్పారు. 2013లోనే వీరితో ఆడానని గుర్తుచేశారు. ఒకే తరానికి చెందిన ఇద్దరు యువ ఆటగాళ్లు వరల్డ్ టైటిల్ కోసం తలపడటం విశేషమన్నారు.
ఒలింపియాడ్‌లో అదరగొట్టిన గుకేష్ పూర్తి విశ్వాసంతో ఉన్నాడని, సిందరోవ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడని ప్రాగ్ తెలిపారు. అయితే వరల్డ్ టైటిల్ డిఫెండ్ చేసుకునే ఒత్తిడి వేరుగా ఉంటుందని, ఆ అనుభవం లేకపోవడంతో దానిని పూర్తిగా వివరించలేమని పేర్కొన్నారు.
భారత్‌లో నంబర్ వన్ ర్యాంక్ గురించి మాట్లాడుతూ.. తనతో పాటు అర్జున్, గుకేష్ మధ్య ఈ స్థానం మారుతూనే ఉంటుందని చెప్పారు. మరోవైపు, టైటిల్ రక్షణకు సిద్ధమవుతున్న గుకేష్.. బుధవారం నీమ్ కరోలీ బాబా ఆశ్రమాన్ని సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా నవంబర్ 24 నుండి డిసెంబర్ 11 వరకు ఈ ఛాంపియన్‌షిప్ జరగనుంది.
చెస్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కులు తలపడుతున్న టోర్నీ ఇదే. 14 క్లాసికల్ గేమ్‌ల ఈ పోటీలో 7.5 పాయింట్లు సాధించిన వారు ఛాంపియన్‌గా నిలుస్తారు. స్కోర్లు సమమైతే డిసెంబర్ 12న టైబ్రేకర్ ఉంటుంది. ఈ టోర్నీ ప్రైజ్ మనీ మొత్తం 2.5 మిలియన్ డాలర్లుగా ఉంది.

