కలం, స్పోర్ట్స్: 15 ఏళ్లకే సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi). సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బిహార్ జట్టును తొలి రెండు మ్యాచ్‌ల్లో నడిపించనున్నాడు. ఈ మేరకు బిహార్ క్రికెట్ అసోసియేషన్ 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. నవంబర్ 14న టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో బిహార్.. సౌరాష్ట్రతో తలపడనుంది. నవంబర్ 16న రైల్వేస్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది.
ఈ రెండు మ్యాచ్‌లకు వైభవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు, భారత టీ20 జట్టులో చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో వైభవ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో బిహార్ సీనియర్ జట్టు పగ్గాలు అందుకోవడం అతడి కెరీర్‌లో కీలక అవకాశంగా మారింది.

