కలం, వెబ్ డెస్క్: జగన్ అవమానించడంతోనే వైసీపీ (YSRCP) నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. ముందు పొమ్మనకుండా పొగ బెట్టారని.. అప్పుడప్పుడు జగన్ (YS Jagan) కూడా అవమానించేసరికి తట్టుకోలేకపోయినట్లు వివరించారు. వైసీపీని వదిలిపోవాలని కలలో కూడా అనుకోలేదని.. తనను వెళ్లగొట్టారని వివరించారు. ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుందని.. దాన్ని దెబ్బతీయాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకుంటారా.. అని ప్రశ్నించారు. కనీసం 70 సార్లు అవమానించారని, వాటిని భరించలేకపోయాయన్నారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను ఎప్పుడూ అవమానించలేదని.. కానీ జగన్ చెప్పుడు మాటలు విని పూర్తిగా మారిపోయారని స్పష్టం చేశారు.
11న పార్టీ ప్రకటన..
నవంబర్ 11వ తేదీన కొత్త పార్టీని ప్రకటిస్తానని విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) అన్నారు. తన పార్టీ రెండు కులాలు, రెండు కుటుంబాలకు చెందినది కాదన్నారు. పార్టీ జెండా, అజెండా సహా అన్ని కీలక విషయాలను ఆ రోజు వెల్లడిస్తామన్నారు. అన్ని మతాలు, సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతోనే పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగ బద్ధంగా వచ్చిన హక్కులను అమలు చేసేందుకు తన పార్టీ పోరాడుతుందన్నారు. దీనిలో చేరడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నట్లు వివరించారు. ఏపీకి ప్రస్తుతం ఉన్న పార్టీలతో న్యాయం జరగదన్నారు.
Also Read : సీజేఐని టార్గెట్ చేస్తారా?.. సుప్రీం కోర్టు ఆగ్రహం
Follow Us On: Youtube

