మహిళపై లైంగిక దాడికి యత్నం..నిందితుడికి 31 ఏళ్ల జైలు శిక్ష: ఎస్పీ శరత్

కలం, నల్గొండ : మహిళపై లైంగిక దాడికి (Sexual Assault) ప్రయత్నించడంతో పాటు ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడికి న్యాయస్థానం 31 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.20 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sharath Chandra Pawar) శుక్రవారం వెల్లడించారు. నల్గొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో 2021లో Cr.No.270/2021గా నమోదైన కేసులో అనంతారం గ్రామానికి చెందిన వజ్జ శ్రీను అలియాస్ కార్తీక్ నిందితుడిగా ఉన్నాడు.

అతడిపై ఐపీసీ సెక్షన్ 306 కింద పదేళ్లు, సెక్షన్ 376 రెడ్ విత్ 511 కింద పదేళ్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద పదేళ్లు, ఐపీసీ సెక్షన్ 342 కింద ఏడాది జైలు శిక్ష విధించారు. ప్రతి సెక్షన్‌కు రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన అధికారులు గుత్తా వెంకట్ రెడ్డి, జి. వెంకటేశ్వర్ రెడ్డితో పాటు ప్రస్తుత ఎస్‌డీపీఓ కె. శివరాం రెడ్డి, సీఐ కె. ఆదిరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎస్. శోభారాణి, ఆర్. అఖిల, డి.సి.ఆర్.బి సీఐ శ్రీను నాయక్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ బి. వెంకటేశ్వర్లు, లైజన్ అధికారులు పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్‌లను జిల్లా ఎస్పీ  అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>