చట్ పూజ తర్వాత కరీంనగర్‌కు వస్తా.. బండి సంజయ్‌తో నితిన్ నబిన్

కలం, కరీంనగర్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యాంగబద్ద సంస్థలపై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొడుతూ సర్ విషయంలో వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు కరీంనగర్‌లో చేపడుతున్న ‘మహా పాదయాత్ర’కు తానే స్వయంగా వస్తానని ఈ సందర్భంగా బండి సంజయ్‌కు నితిన్‌నబీ చెప్పారు.

వాస్తవానికి ఈనెల 5న కరీంనగర్ రావాల్సి ఉన్నప్పటికీ, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున రాలేకపోయానన్నారు. ఈసారి ‘చట్ పూజ’ అనంతరం తప్పకుండా కరీంనగర్ వచ్చి మహా పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. కరీంనగర్ లో కాషాయ శ్రేణుల జోష్‌ను చూస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా నితిన్ నబిన్ బండి సంజయ్‌తో చర్చించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>