ఆంక్షలు ఎక్కువైతే ఉల్లంఘనలే.. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం!

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం (Delhi Pollution)పై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు ఆంక్షలు ఎంతగా పెంచితే, ప్రజల్లో వాటి ఉల్లంఘనలు అంతగా పెరుగుతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) వ్యాఖ్యానించారు. నిబంధనలను ధిక్కరించడం ప్రజల్లో ఒక సహజ ధోరణిగా మారిపోయిందని ధర్మాసనం అభిప్రాయపడింది.

దీపావళి పండుగ వేడుకల సమయంలో బాణసంచా, వాయు కాలుష్యం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కేవలం ఆంక్షలు విధించడం ద్వారానే కాకుండా, కాలుష్య నివారణపై పౌరుల్లో స్వచ్ఛందంగా చైతన్యం తీసుకురావడం ముఖ్యమని ధర్మాసనం తెలిపింది.

ఆధారాలు లేని వాదనల ఆధారంగా తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) నిబంధనల్లో ఏవైనా మార్పులు చేయాలంటే కచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు తప్పనిసరి అని వెల్లడించింది. శాస్త్రీయ అధ్యయనాలు, స్పష్టమైన నివేదికలు సమర్పించే వరకు ప్రస్తుతం ఉన్న గ్రాప్ (GRAP) విధానమే యథావిధిగా కొనసాగుతుందని న్యాయస్థానం పేర్కొన్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>