కలం, నర్సాపూర్ (జి) : నర్సాపూర్ (జి) (Narsapur Accident) మండలం నసీరాబాద్ గ్రామ సమీపంలోని 61వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై గణేష్, స్థానికుల కథనం ప్రకారం.. భైంసా పట్టణానికి చెందిన సాబీర్ అనే వ్యక్తి శుక్రవారం ఉదయం టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై నిర్మల్ వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాబీర్ కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.

