కలం, వెబ్ డెస్క్ : అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజులను చవిచూసిందని, ఎన్నికల ఫలితాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ట్రూత్ సోషల్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని స్థాయికి మార్కెట్‌ను తీసుకెళ్లేందుకు తాము ఎంతో కష్టపడ్డామని, ఇప్పుడు ఈ పరిణామం చోటుచేసుకోవడం బాధాకరమని తెలిపారు.
ఈ మార్కెట్ పతనం వల్ల పౌరుల 401k రిటైర్మెంట్ ఖాతాలు పడిపోయాయని ట్రంప్ పేర్కొన్నారు. దీనికి రిపబ్లికన్లు కారణం కాదని, డెమోక్రాట్లే కారణమని ఆయన విమర్శించారు. అయితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే మరింత బలంగా పుంజుకుంటామని ధైర్యం చెప్పారు. అమెరికాను మళ్లీ గొప్పగా మారుస్తామని (Make America Great Again) ఆయన తన పోస్ట్‌లో స్పష్టం చేశారు.

