కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా కేంద్రంలోని పాత చేపల మార్కెట్ ప్రాంతంలో ఒక ఇంట్లో పగటి పూట దొంగతనం కలకలం సృష్టించింది. ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి.. గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి, నీళ్లు కావాలని అడిగాడు. ఆ తర్వాత మహిళ మెడలో ఉన్న 6 తులాల పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సీసీటీవీ పూటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

