గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్: రానున్న గోదావరి పుష్కరాలకు (Godavari Pushkaralu) వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాసరతో పాటు జిల్లాలోని పుష్కర ప్రాంతాల్లో భక్తులు సౌకర్యవంతంగా పుణ్యస్నానాలు ఆచరించేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతంగా పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని, స్పష్టమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కర ఘాట్ల వద్ద నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టడంతో పాటు, భక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు అవసరమైన చోట్ల సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో పాటు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి కూడా అవసరమైన వసతులు కల్పించాలని తెలిపారు.

భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పుష్కర ప్రాంతాల్లో అవసరమైన అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవ రావు, అదనపు ఎస్పీ ఉపేంద్ర రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ ఈఈలు సందీప్, సుభాష్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>