24 రోజులుగా సమ్మె.. పోచమ్మకు బోనాలు సమర్పించిన NHM ఉద్యోగులు

కలం, నిర్మల్‌: జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల (NHM Employees)న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె గురువారంతో 24వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సమ్మె శిబిరంలోనే బోనాలు (Bonalu)వండిన ఉద్యోగులు పోతరాజుల నృత్యాల మధ్య బోనాలతో స్థానిక బస్సు డిపో బోయివాడలోని అడెల్లి పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు.

అక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దయతోనైనా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తమ సమస్యల పరిష్కారంపై సద్బుద్ధి కలగాలని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చేలా ఆశీర్వదించాలని వేడుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించే వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>