‘చివరిసారి మాట్లాడదాం’ అని పిలిచి.. పొలంలో దారుణం!

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణ ఘటన (Meerut Murder) చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఫిరోజ్ అనే వ్యక్తి సేమరీన్ అనే యువతిని గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని సమీపంలోని పొలంలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. చాలాకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుండగా, ఇటీవల సేమరీన్ అతడికి దూరంగా ఉంటూ వచ్చింది.

ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించడంతో, ఫిరోజ్ ఆ సంబంధాన్ని వ్యతిరేకించాడు. చివరిసారిగా మాట్లాడదామని నమ్మించి సేమరీన్‌ను పిలిపించిన అతడు, మాటల మధ్య వివాదం తలెత్తడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడు ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>