ప్రాణాలకు తెగించి రక్షణ చర్యలు.. సిబ్బందికి సీఎం రేవంత్ అభినందనలు!

కలం, ఖమ్మం బ్యూరో: ​ఖమ్మం జిల్లా సత్తుపల్లి (Sathupally) మండలం బేతుపల్లి చెరువులో ప్రాణాలను పణంగా పెట్టి చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. భారీ వర్షాలు, ఉప్పొంగుతున్న వరద ఉధృతిలో గల్లంతైన మత్స్యకారులతో పాటు, వారిని రక్షించేందుకు వెళ్లి చిక్కుకుపోయిన ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది అందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన సహాయక బృందాల ధైర్యసాహసాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కొనియాడారు. క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో సిబ్బంది ప్రదర్శించిన అంకితభావం ఎంతో ప్రశంసనీయమని ఆయన అభినందించారు.

​భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న బేతుపల్లి చెరువు(Bethupalli Lake)లో మత్స్యకారులు చిక్కుకోవడం, వారిని కాపాడేందుకు వెళ్లిన సిబ్బంది సైతం వరదలో ఇరుక్కోవడం తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. ఈ ప్రమాదకర సమయంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), అగ్నిమాపక సిబ్బందితో పాటు జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాయి. అన్ని శాఖలు సమన్వయంతో చేసిన కృషి ఫలితంగా ప్రాణనష్టం తప్పి, అందరూ సురక్షితంగా బయటపడగలిగారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సిబ్బంది చూపిన తెగువను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సహాయక చర్యలను ఎక్కడా లోపం తలెత్తకుండా సమర్థవంతంగా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్‌తో పాటు, పాల్గొన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అందరికీ ఆయన (CM Revanth Reddy) అభినందనలు తెలియజేశారు.

Also Read : బెంగళూరు మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పింక్ లైన్‌కు గ్రీన్ సిగ్నల్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>