రిగ్గింగ్ కలకలం.. బ్యాలెట్ బాక్స్ చోరీ

కలం, వెబ్ డెస్క్: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లా (Anantapur District)లో రిగ్గింగ్ కలకలం రేపింది. కూడేరు మండలం మరుట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు బ్యాలెట్ బాక్సును బద్దలు కొట్టి, చోరీ చేసినట్లు తెలుస్తోంది. మరికొందరు బ్యాలెట్ పత్రాలను చించేశారు.

ఈ సందర్భంగా సీఐ రాజుతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. శెట్టూరు మండలం చిందర్లపల్లిలో టీడీపీ, వైసీపీ నాయకులు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా వి.కోటలో ఓటు వేసేందుకు వచ్చిన ఒక మీడియా రిపోర్టర్‌పై సీఐ సోమశేఖర్ రెడ్డి దాడి చేశారని ఆందోళనకు దిగారు.

ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు..

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయకుండా వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను కలిసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించామన్నారు. ఓటింగ్ తగ్గితేనే తమకు లాభమవుతుందని భావించి.. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గల్లా మాధవి, నజీర్ అహ్మద్ విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>